మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి ఫిబ్రవరి 6:
మంగళ వారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారుల శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగిసినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 61 గ్రామ పంచాయతీలకు, జిల్లా అధికారులను,మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, వీరు బాధ్యతలు కూడా స్వీకరించారని తెలిపారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు అందరు నూతన పంచాయితీరాజ్ యాక్ట్ 2018 పై స్పష్టమైన అవగాహన పొందాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలను సక్రమంగా నిర్వహించే గురుతర బాధ్యత ప్రత్యేక అధికారులపై ఉంచిందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.గ్రామపంచాయతీ నిర్వహణను ప్రతిష్టాత్మకం గా తీసుకోవాలని ,గ్రామ పంచాయతీల సక్రమ నిర్వహణకు సీనియర్ అధికారులను సైతం గ్రామపంచాయతీ అధికారులుగా నియమించడం జరిగిందని, ప్రత్యేక అధికారులు సర్పంచుల కన్నా ఇంకా జాగ్రత్తగా గ్రామపంచాయతీల విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక అధికారులుగా నియామకం అయినందున పంచాయితీ శాఖ అధికారాలు, విధులు తెలుసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులు జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా వివిధ దశలలో వున్న అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. మౌళిక సదుపాయాల కల్పనతో పాటు గ్రామాలలోని యువతను అభివృద్ధి పనులలో భాగస్వామ్యం చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. పంచాయితీ రాజ్ చట్టంలో సూచించిన విధంగా క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలని, గ్రామ పంచాయితీ సెక్రటరీ, సిబ్బంది సమన్వయంతో ప్రజల అవసరాలను తీర్చాలని, గ్రామాభివృద్దికి కృషి చేయాలని తెలిపారు. ప్రతి రెండు నెలలకు జరిగే గ్రామ సభలకు ప్రత్యేక అధికారులు అధ్యక్షత వహించి ఆదాయ వ్యయాలపై సమీక్షించాలని, గ్రామాభివృద్ధి ప్రణాళికల రూపొందించి గ్రామ సర్పంచ్ పోర్టల్ లో నమోదు చేయాలని, 100 శాతం ఇంటి పన్నులు వసూలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మేడ్చల్ జిల్లా హైదరాబాద్ కి దగర గా వుంది అభిరుద్ది చాల వేగవంతము గా ఉంటుంది కావునా గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినారు మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయతీలలో భూములను కాపాడటం లో ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయితీల ఆస్తులను పరిరక్షించాలని, లే అవుట్లను పరిశీలించాలని, తప్పనిసరిగా లే అవుట్లో పది శాతం గ్రామ పంచాయితీకి చెందేలా చూడాలని అన్నారు. నిబంధనల ప్రకారమే బిల్డింగ్ అనుమతుల ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఉపాధి హామీలో గ్రామాల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ పనులు చేపట్టేలా, ఎక్కువ మందికి పనులు కల్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ సంబంధించిన 7 రిజిష్టర్లు సక్రమంగా నిర్వహించబడేలా చూడాలని, అలాగే గ్రామ పంచాయితీలలో జరిగిన పనులకు సంబంధించి రికార్డులు ఆడిట్ చేయించాలని, ప్రతి నెలా సిబ్బంది జీతాలు, సిసి బిల్లులు, ట్రాక్టర్, ట్రాలీ పేమెంట్స్ చెల్లించేలా చూడాలని తెలిపారు. గ్రామ పంచాయితీల ఆదాయ మార్గాలను పరిరక్షించాలని, రిజీష్టర్స్ నిర్వహించాలని, వచ్చే నిధులలో పారిశుద్యం, తాగునీటిపై నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయితీల నిర్వహణలో భాగంగా నీటి సరఫరా, పారిశుద్యం, గ్రీవెన్స్, టాక్స్ కలెక్షన్స్, బడ్జెట్ తదితర రిజిష్టర్లను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.
జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, పంచాయతీరాజ్ చట్టం, స్టాండింగ్ కమిటీలు, ప్రత్యేక అధికారుల విధులు, బాధ్యతలు, సమావేశాల నిర్వహణ, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతలు, విధులు, లేఅవుట్ల నిర్వహణ, సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణ ,తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు..
ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారులకు పంచాయితీ రాజ్ చట్టం 2018, విధులు, బాధత్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, డీపీవో రమణమూర్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.