గత ప్రభుత్వం చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నం జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల్లు దుర్గా ప్రసాద్,జావేద్
రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు
మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రం అప్పులు కుప్పగా మార్చారు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 6 (ప్రజాబలం) ఖమ్మం పది ఏండ్లుగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుల్లు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్ లు ఆరోపించారు. మంగళవారం స్థానికంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ దనికంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పగిస్తే ఖజానా అంతా ఖాళీ చేశారని విమర్శించారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని అమలు చేయడం ప్రారబించిందని అందులో భాగంగా ఆరు గ్యారెంటీల్లో రెండిటినీ విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మరి కొద్ది రోజుల్లోనే మరో రెండు గ్యారంటీలు ఉచిత విద్యుత్ తో పాటు 500 కే గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కారు కూతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే నేడు పెన్షన్ లు, రైతు బంధు పడటంలో జాప్యం జరుగుతుందని అన్నారు. ఎక్కడికక్కడ కమీషన్లు దండుకుని అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తుందని అవినీతి అక్రమాలకు తావు లేకుండ ప్రజాపాలన అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకొని నోటికి ఏది వస్తె అదే మాట్లాడుతున్నారని జిల్లా లో గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందో మొన్న కాంగ్రెస్ కు పోల్లైన ఓట్లే రుజువు చేశాయని తెలియాజేశారు. కేంద్రంలో కూడా రాభోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని గతంలో కూడా కొందరు నేతలు రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయిందని పిచ్చి కూతలు కూశారని కానీ భారీ మెజార్టీతో ప్రజలు అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పై జిల్లాలో బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని బిజెపి బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ గెలుపును అడ్డుకొలేవు అని అన్నారు. అసెంబ్లీ లో ఓటమి పాలైన బిఆర్ఎస్ తన ఉనికి చాటుకోవడానికి పనికి మాలిన ఆరోపణలు చేస్తుందని పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.