దళిత బంధు లబ్ధిదారులు అధైర్య పడొద్దు.

కాంగ్రెస్ ప్రభుత్వం వారికి
అండగా ఉంటుంది.
జిల్లా అధికారులతో మాట్లాడిన
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వోడితల ప్రణవ్.

హుజురాబాద్ ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 6

దళిత బంధు లబ్ధిదారులు ఎవరు అధైర్యపడవద్దని త్వరలోనే రెండో విడత డబ్బులను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ వోడితల ప్రణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దళిత బంధు పథకంలోని రెండో విడత నిధుల మంజూరు విషయంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. బిఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్లు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking