రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 ఫిబ్రవరి 2025
మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో ఫిబ్రవరి 2 ఆదివారం రోజున ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు జరిగే తెలంగాణ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ ముఖ్య అతిథిగా మునిసిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, టోర్నమెంట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్య అతిథిగా తెలంగాణ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణలు పాల్గొంటున్నారు, ఇట్టి కార్యక్రమం నిర్వహణ సందర్భముగా స్థానిక జూనియర్ టీమ్కు టీషర్టులు అందచేస్తున్న అసోసియేషన్ ముఖ్య సలహాదారు అందె లక్ష్మణ్ రావు, అధ్యక్షుడు ఆనంద్, కార్యదర్శి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షుడు హరిహరనాథ్ రెడ్డి, నరహరి శాస్త్రి, సీతారామరాజు, రమేష్, రామిరెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజు, అసిమ్ తదితరులు టోర్నమెంట్ కార్యక్రమాన్ని జయప్రదం కావించడానికి కలసి కట్టుగా సంఘటితంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.

