రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 ఫిబ్రవరి 2025
మణికొండ భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కలసి కట్టుగా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు అత్యంత ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో భాగంగా సఫాయి కర్మచారుల సమస్యలు దృష్టికి రావడంతో వారికి సంఘీభావం తెలుపుతూ వారి సమస్యలలో ప్రధానముగా తెల్లవారుజామున 5 గంటలకు మొదలు పెట్టి 9 వరకు చీపుర్లు పట్టుకొని వీధి మొత్తంగా ఊడుస్తూ మళ్లీ 9.30 మొదలుకొని మధ్యాన్నం 1 వరకు పనిచేస్తున్నను గత 2 సంవత్సరములుగా జీత బత్యాలు పెంచకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, జబ్బు పడితే ఇన్స్యూరెన్స్ లేకుండా నానా పాట్లు పడుతున్నామని వాపోయారు ఇట్టి విషయాలు మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ న్యాయం చేయమని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశిన వారిలో భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంబగళ్ళ ధనరాజ్, ప్రధాన కార్యదర్శి గుట్టమీది నరేందర్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి మరియు సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు, కీర్తి లతా గౌడ్, బుధోలు బబ్లు, మాల్యాద్రి నాయుడు, సంఘం శ్రీకాంత్, శ్రీనాథ్ గౌడ్, ఏర్పుల శ్రీకాంత్, యాలాల కిరణ్ సుమ, భానుచందర్, షైక్ ఆరిఫ్, బాలాజీ , బొడ్డు శ్రీధర్, సుమన్, రమణారెడ్డి, రాజు, శ్రీశైలం విట్టల్ మొదలగు వారు పాల్గొన్నారు.
