రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 1 ఫిబ్రవరి 2025
తెలంగాణ రాష్ట్రమ్లో పదవ తరగతి చదివే విద్యార్థులకు పాఠశాల సమయం తత్ ప్రశ్చయాత్ అదనపు తరగతులు నిర్వహించే సందర్భంగా విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం సమకురుస్తామని ప్రభత్వ పరంగా హామీ ఇవ్వడం అందుకు 11 కోట్ల బడ్జెట్ అవసరమని తెలుపుతూ ఫిబ్రవరి 1 నుండి 20 మార్చ్ వరకు ఏకమొత్తంగా 38 రోజుల పాటు ఉడక పెట్టిన పెసర్లు, బెబ్బర్లు, శనిగలు, బెల్లం పల్లీల పట్టి, పకోడీ, మిల్లెట్ రూపాలలో రోజుకు ఒక రకంగా అందిస్తామని తెలియ జేసిన దరిమిలా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించడం జరిగినది, కానీ యథా ప్రకారం ప్రజలకు ఇచ్చిన అన్ని హామిలతో పాటు పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం తలపెట్టిన సాయంత్రం అల్పాహారం విషయంలో కూడా తుంగలో తొక్కి జత చేయడం విచారకర విషయమని వి ఆర్ 4 సహ్యోగ్ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు భాధతప్త హృదయంతో కలత చెందుతూ, యదావిధిగా తమ విద్యుక్త ధర్మంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా మా యొక్క సంస్థ వి.ఆర్.4 సహాయోగ్ చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో మణికొండ గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క 210 మంది విద్యార్థులకు సాయంత్రం అల్పాహారంగా బిస్కెట్ మరియు ఖారా అందజేయడం జరిగినదని, ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిరంజన్, ఉపాద్యాయులు శివరాం, కుమార్, ప్రదీప్ కుమార్ ఇతర పాఠశాల ఉపద్యాయినీలు మరియు ట్రస్ట్ కోశాధికారి దిలీప్ కక్కడ్, బోడ్డు శ్రీధర్, సుమ నళిని తది తరులు పాల్గొనీ కార్యక్రమాన్ని జయప్రదం గావించిన్నారు.
Prev Post