ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 5 :
మందమర్రి తాపీ మేస్త్రి సంఘం గౌరవ అధ్యక్షుడిగా బండి సదానందంను ఎన్నుకున్నారు. బుధవారం జరిగిన తాపీ మేస్త్రీ సంఘం సమావేశంలో బండి సదానందం యాదవ్‌ను సంఘ గౌరవాధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. అనంతరం
గౌరవాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, తాపీ మేస్త్రీల సంక్షేమం కోసం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో కార్మికుల హక్కులు, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.