మంత్రి పొన్నం ప్రభాకర్
జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జా కు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ , కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,ఆర్డీవో ,ఎమ్మార్వో తదితర అధికారులు
సర్వే నెంబర్ 102/1హెచ్‌ఏకె/1 లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్నీ పరిశీలించి పెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ స్థలం విలువ సూమారుగా 1200కోట్లు ఉంటుందని అంచనా.

12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జా కు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు..
మంత్రి పొన్నం ప్రభాకర్
బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వ్ నెంబర్ లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జా కి గురికావడంతో కలెక్టర్ ,ఆర్డీవో ఎమ్మార్వో తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ అధీనంలోకి తీసుకోవడం జరిగింది
దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేశారు
ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కి హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా అభినందనలు తెలిపారు.
ధరణి తరువాత భూ భారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జా కు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.