👉 సర్వీసు రోడ్ లో రిక్వెస్ట్ స్టాప్ కోసం ఎదురుచూపులు
👉 పట్టించుకోని ఆర్టీసీ అధికారులు
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 3 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గ్ మండల పరిధిలో గల రాంపూర్ చౌరస్తాలో రిక్వెస్ట్ స్టాప్ కోసం ఆరు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు, పల్లె ప్రజలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలు అందాలని, అధికారులు పదేపదే చెబుతున్న, ఆ దిశగా అడుగులు పడటం లేదు, తమకు బస్సు సేవలను చేరువ చేయాలని విజ్ఞప్తులు చేస్తున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు, జాతీయ రహదారి నిర్మాణంతో ఇక్కడ బస్సులు ఆగకుండా పోతున్నాయని, అల్లాదుర్గం మండలం రాంపూర్ చౌరస్తా పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సర్వీసు రోడ్డు మీదుగా బస్సులు రాకపోకలు సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని, గత నెలలో రాంపూర్ గ్రామస్తులు నారాయణఖేడ్ డిపో మేనేజర్ కి వినతిపత్రం అందజేశారు, డిపో మేనేజర్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఇంతవరకు ఎలాంటి మార్పు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు, ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే, రాంపూర్,తో పాటు సీతా నగర్, సీతానగర్ తండా, కాయిదంపల్లి, నీలకంఠపల్లి, గ్రామాల ప్రజలకు ఆర్టీసీ సేవలు చేరువవుతాయని ఇకనైనా అధికారులు పట్టించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున డిపోను ముట్టడిస్తామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు…..