ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 3:
నీట్ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నీట్ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని, ఈ పరీక్షకు జిల్లా నుండి 4 వేల 336 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నానం 1.30 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నానం 1.30 గంటలకు గేట్లు మూసివేయడం జరుగుతుందని, అభ్యర్థులు ఇట్టి విషయాన్ని గమనించి, నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టరు సూచించారు. అభ్యర్థులు చివరి నిమిషయంలో కంగారు పడకుండా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లో ఉన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టరు తెలిపారు.