స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూన్ 23:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 2023–2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు చిన్నతరహా, మధ్యతరగతి రంగాలకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరములో జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్ల జిల్లా స్థాయి, సమన్వయ సమీక్ష సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, అధ్యక్షత వహించారు
ఈ సందర్భంగా 2023–2024 సంవత్సరానికి సంబంధించి రూ.రూ. 18,370 కోట్లతో జిల్లాకు సంబంధించిన ఈ సంవత్సరానికి చెందిన వార్షిక రుణ ప్రణాళికను అదనపు కలెక్టర్ విడుదల చేశారు. గత సంవత్సరం రూ.16,373 కోట్లతో జిల్లా రున ప్రణాళికను రూపొందించగా ఈ యేడు దానిని మరింత ఎక్కువగా పెంచామని వివరించారు.
జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని ప్రతి బ్యాంకు తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దానికి అణుగుణంగా రుణాలను అందచేయాలని కోరారు. అధికారులు రైతుల రుణాల మంజూరీకి సంబంధించిన పూర్తి డేటాను, వివరాలను బ్యాంకు అధికారులు, సిబ్బందితో కలిసి బ్యాంకుల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకొని పని చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల మంజూరీలో ఏఏ బ్యాంకులు ఎంత వరకు రుణాలు మంజూరీ చేశారు, గ్రౌండింగ్కు సంబంధించిన వివరాలను ఆయా బ్యాంకుల వారీగా అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకొన్నారు.
అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించేలా ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. సర్వీస్ సెక్టార్ లో రుణాలు వేగవంతంగా ఇవ్వడంలో బ్యాంకర్లు చొరవ చూపాలని అన్నారు. అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఎప్పటికప్పుడు లిస్టవుట్ చేసి ఫాలో అప్ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది ఏమాత్రం అలసత్వం, జాప్యం చేయకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టి సర్వీస్ సెక్టార్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి రుణాలు అందజేయాలన్నారు. అలాగే ముఖ్యంగా నిరుద్యోగ యువతీ, యువకులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలను అందచయడం జరుగుతుందని వీటి మంజూరుకు బ్యాంకర్లు తమ వాటాను మంజూరు చేసి యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా బ్యాంకు మేనేజర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఐ .శ్రీనివాసులు , ఆర్ బి ఐ .ఎల్ డి ఓ ,తేజ్ దీపిత బెహరా ,నాబార్డ్ ,డిడి ఓ,సురభి , ఆయా బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ కార్పొరేషన్, వినోద్ ,బాలాజీ , జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ రేఖ, సి డి పి ఓ ,పావని మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking