చెరువు కైతే హద్దు వాగుకు అడ్డు లేదని రెచ్చిపోతున్న మట్టి మాఫియా…
చోద్యం కాదు ఆస్వాదిస్తున్న అధికారులు..
ప్రజాబలం వర్ధన్నపేట నియోజకవర్గం జూన్ 23
మనలో ఇప్పటివరకు చాలా మంది వాగుల్లో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన అనేక వార్తలను చూసి ఉంట్టం. ఎండాకాలం వచ్చింది అంటే వాగులు ఎండిపోగానే అక్రమ మార్గాన ఇసుకను కొట్టేసే ఘరానా మోసగాల్లను చూసే ఉంటాం. వాగుల్లో ఇసుకే వరకే పరిమితం ఎందుకు కావాలనుకున్నాడో ఏమో గాని ఈ మోసగాడు మరో రెండాకులు ఎక్కువ చదివినట్టు ఉన్నాడు. ఆలోచన రావడమే తరువాయి వాగులో మట్టి తవ్వకాలకు తెరలేపి మాఫియానే తలదన్నేలా రాత్రి వేళలో వాగు పొడుగునా మట్టిని తవ్వేస్తూ వేల రూపాయలను జేబులో వేసుకుంటున్న వైనం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది. అక్రమార్జన పరమావధిగా ప్రజా ఆస్తులను కొల్లగొడుతున్న అక్రమార్కులు మరీ ఇంత దిగజారి పోతారని ఎవరు అనుకోని ఉండరు. చెరువులు, గుట్టలు, అక్రమ మట్టి తవ్వకాలకు కేంద్ర బిందువులుగా ఉండేవి, అలాంటిది వాటిని తలదన్నేలా కనివిని ఎరుగని రీతిలో వాగునే అడ్డగా చేసుకొని ఇసుకతో పాటు కిలోమీటర్ల పొడుగుతో వాగులో మట్టిని తవ్వేస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. ఇంత జరుగుతున్న అధికారులకు తెలియకపోవడంలో ఆంతర్యం ఏమిటో, సిటీ సెంటర్ కు ఆనుకుని ఉన్న హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎస్సార్ యూనివర్సిటీ వెనుక వైపున ఉన్న అనంతసాగర్ పెద్దవాగులో అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కిలోమీటర్ల మేర పెద్దవాగును కొల్లగొడుతూ అడ్డు అదుపు లేకుండా జెసిబి తో తవ్వేస్తూ వాగుకు ఇరువైపులా ర్యాంపులను ఏర్పాటు చేసి మొరాన్ని తరలిస్తున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. డబ్బే పరమావధిగా భావిస్తున్న ఈ ఘనుడు మామిడి తోటలో మకం వేస్తూ అటువైపుకు వచ్చి ఏంది ఇది అని ఎవరైనా ప్రశ్నిస్తే అధికారులే నన్ను అడిగరనీ, అడగడానికి మీరెవరు అని హుకుం జారీ చేస్తూ మా వాళ్లను పిలిస్తే ఇక్కడే పాత రేస్తారని బెదిరిస్తుండడంతో ప్రశ్నించేవారు భయంతో బింబెలెత్తిపోతున్నరూ. రాత్రి వేళల్లో తవ్వుతూ పెద్దవాగుకు ఆనుకొని నూతనంగా నిర్మిస్తున్న వెంచర్లో మోరాన్ని అమ్ముకొని లక్షల రూపాయలను అక్రమంగా సంపాదిస్తూ వెనకేసుకుంటున్న అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానిక ప్రజలు రైతులు ప్రశ్నిస్తున్నారు. వాగును కొల్లగొడుతున్న అక్రమార్కుని పై కఠినంగా చర్యలు తీసుకొని మరెక్కడ ఎవరు ఇలాంటి పనులు చేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.