ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 18 :
సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్- ఐ.ఎన్. టి.యూ. సి కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శిగా బన్న లక్ష్మణ్ దాస్ ను నియమిస్తూ ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్, తెలంగాణ కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాసిపేట మండల కేంద్రానికి చెందిన బన్న లక్ష్మణ్ దాస్ ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రేస్ లో సుదీర్ఘ కాలం పని చేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పార్టీ పటిష్టతకు, కాంగ్రేస్ పార్టీ అనుబంధ సంఘాల బలోపేతానికి కృషి చేసారు. ఆయన సేవలను గుర్తించిన ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీలో స్థానం కల్పించింది. లక్ష్మణ్ దాస్ తండ్రి బన్న ఆశాలు 1965 నుండి కాంగ్రేస్ పార్టీలో పని చేసి అనేక పదవులను అలంకరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ నాకు అవకాశం కల్పించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డికి సెక్రటరీ జనరల్ బి. జనప్రసాద్ కి నా నియమకానికి సహకరించిన శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులకు, ఐ.ఎన్.టి. యూ.సి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మన్నకి, సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంశెట్టి నరేందర్ నాయుడుకి, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షులు దేవి భూమన్న కి, అసంఘటిత కార్మిక విభాగం మందమర్రి ఉపాధ్యక్షులు రాపర్తి శ్రీనివాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ కార్మికుల శ్రేయస్సు కోసం యూనియన్ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.