అక్రమంగా వేసిన షెడ్లను తొలగించిన మున్సిపల్ అధికారులు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 18:

మందమరి మార్కెట్ ఏరియాలో అక్రమంగా వేసిన దుకాణాలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగించారు. గత కొన్ని రోజుల క్రితం వెలసిన ఈ దుకాణాలను అక్రమంగా నిర్మించారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు ఈ చెరువులకు ఉపక్రమించారు. ఇకపై ఎవరైనా ఇలా షాపులు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking