జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై ఆవగాహన

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 18:

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సారధి కళాకారులు మార్కెట్లో శనివారం ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీవో ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని వేగాన్ని అదుపులో ఉంచి బండ్లను నడపాలని తమ పాటలు ద్వారా వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సారధి కళాకారులు వెల్తురు పోషం, కొప్పర్తి రవీందర్, వావిలాల నాగలక్ష్మి, చేగుంట నిరోషా, మామిళ్ళ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking