దేశ రాజకీయాల్లో అరుదైన నాయకుడు ఎన్టీఆర్

-టిడిపి పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 18:

దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అరుదైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)అని పట్టణ అధ్యక్షుడు వాసాల సంపత్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం స్థానిక సింగరేణి పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహంకు నివాళులు అర్పించారు. అనంతరం మానసిక వికలాంగులకు పిల్లలకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ అరుదైన నాయకుడని పేద బడుగు బలహీనవర్గాల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తొమ్మిది నెలల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అధికార కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన మహా నాయకుడన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం దిశగా కార్యకర్తలు నాయకులు నడిపించాలన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో బి. సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్. జయ, అపర్ణ, జ్యోతి, నరసయ్య, పారుపల్లి శ్రీనివాస్, సత్యనారాయణ. చాట్లపల్లి రాజేష్, కనకయ్య, నరసమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking