లిటిల్ స్టార్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 12 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని లిటిల్ స్టార్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే ఈ పండుగ ఎంతో విశిష్టమైనదని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పువ్వులను పూజించే ఈ పండుగను మన రాష్ట్రంలో జరుపుకోవడం ఎంతో విశేషమని తెలిపారు. ఇలాంటి పండుగలు పాఠశాలలో నిర్వహించడం ద్వారా విద్యార్థులకు మన పండుగల విశిష్ట తెలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది దుర్గామాతను అలంకరించిన తీరు పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులు రకరకాల పువ్వులతో బతుకమ్మలను తయారు చేశారు.అనంతరం బతుకమ్మలకు పూజ చేసి కోలాటం చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మహమ్మద్ హమీద్, మినుములు శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు,పోషకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking