ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి దశదిన కర్మకు హాజరయిన జిల్లా ఎస్పీ డా.వినీత్.జి
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి అక్టోబర్ 12 (ప్రజాబలం) కొత్తగూడెం గత నెల 30వ తారీఖున భద్రాచలం బందోబస్తు నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి గారి దశదిన కర్మకు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి హాజరయ్యారు ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో కలిసి సహాపంక్తి విందులో పాల్గొన్నారు.శ్రీదేవి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆమె మరణం జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటని,మంచి అధికారిగా పేరు ప్రతిష్టలు సాధించుకున్నారని అన్నారు దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన వలన శ్రీదేవి గారిని కోల్పోవడం చాలా భాధాకరం అన్నారు. శ్రీదేవి గారి కుటుంబానికి పోలీస్ శాఖఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియ జేసారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఇ.విజయ్ బాబు,కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు జిల్లాలోని సిఐలు ఆర్ఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.