ఎన్ఎస్విలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

 

జగిత్యాల, అక్టోబర్ 18: ప్రముఖ విద్యాసంస్థ ఎన్ ఎస్.వి. జూనియర్ కళాశాలలో బుధవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకను పురస్కరించుకొని ముస్తాబైన కళాశాల విద్యార్థినులు తీర్చి దిద్దిన బతుకమ్మ ను కీర్తిస్తూ పాడిన పాటలతో ఆ కళాశాల ప్రాంతం ఆహ్లాదంతో నిండిపోయింది. బతుకమ్మ ను పురస్కరించుకుని పలువురు విద్యార్థినులు మహిషాసురమర్ధిని, నవదుర్గ మాతల వేశదారణలు ఆహుతులను, చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్కే, ఎన్ఎస్వీ కళాశాలల చైర్మన్ యాద రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయానికి అద్దం పడుతున్న బతుకమ్మ వేడుకను అన్ని కళాశాలలో ఘనంగా జరుపుకొంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్వి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పల్లెర్ల నరేష్, పలువురు ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థినులు, పలువురు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking