బిజెపి పట్టణ ఉపాధ్యక్షులుగా రాజేందర్

 

జగిత్యాల, అక్టోబర్ 18: భారత జనతాపార్టీ జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షులుగా గాదాసు రాజేందర్ ను నియమిస్తూ పట్టణ అద్యక్షులు వీరభత్తిని అనిల్ ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో అనీల్ ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం నిరంతరంగా శ్రమిస్తానన్నారు. అలాగే బిజెపి బలోపేతానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అర్వింద్, జిల్లా అధ్యక్షులు మోరపెల్లీ సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి, పట్టణ అద్యక్షులు అనీల్ కు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking