ఘనంగా మడుపల్లి అంగన్వాడి సెంటర్ లో బతుకమ్మ సంబరాలు
మధిర టు సెక్టార్ సూపర్వైజర్ జక్కుల నాగ సత్యవతి
మధిర ప్రతినిధి అక్టోబర్ 9 (ప్రజాబలం) మధిర ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మధిర సెక్టార్ టు మడుపల్లి అంగన్వాడి సెంటర్లో లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో సూపర్వైజర్ జక్కుల నాగ సత్యవతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ సంబరాలని, తెలంగాణ రాష్ట్రంలోనే కాక ప్రపంచ దేశాలలో బతుకమ్మ పర్వదిన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ అపురూపమైన పండుగ అని ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని దాగి ఉన్న సామర్ధ్యాన్ని వెలికితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పిల్లలు, మొదలగు వారు పాల్గొన్నారు