ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బతుకమ్మ ఏర్పాటు చేయాలి.

 

మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య.

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 4

సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకొని ప్రజలు ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బతుకమ్మ ఘాట్లలో ఏర్పాటు చేయాలని మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య అన్నారు. ఇల్లందకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజున బతుకమ్మ ఏర్పాట్లపై కార్యదర్శిలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ గ్రామాల్లో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చెరువుల దగ్గర కుంట్ల దగ్గర అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking