గ్రామపంచాయతీ కార్మికులకు కంటి పరీక్షలు

 

ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 4

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇల్లందకుంట మండల వైద్య అధికారి డాక్టర్ తులసీదాస్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తులసీదాసు మాట్లాడుతూ స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్య అధికారి ఉప వైద్యాధికారి ఆదేశాల మేరకు మండలంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించామని తెలిపారు.వారి కంటి లోపల ఉన్న కంటి సమస్యలను గుర్తించి క్యాటరాక్ట్ కంటి పొరల సమస్యలు ఉన్నవాళ్ళకు ఆపరేషన్ కి రిఫర్ చేశామని, ఆపరేషన్ అవసరంలేని కార్మికులకు కంటి అందాలను అందజేసినట్టు డాక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ జలంధర్.ఎంపీడీఓ పుల్లయ్య.ఏపీఓ రాజేశ్వర్ రావు, డాక్టర్ కళ్యాణ్,శ్రీనివాస్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking