బిసి సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం ముట్టడి
హైదరాబాద్ ఏప్రిల్ 21 ();ఎస్సి ల మాదిరిగానే బిసి లకు కుడా బీసీ బందు పథకం ప్రవేశపెట్టి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని అలాగే పెరిగిన తరల ప్రకారం స్కాలర్ షిప్ లు మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాదిమంది బీసీలు నేడు బిసి సంక్షేమ శాఖ మంత్రి కార్యాలయం ముట్టడించారు. వివిధ ప్రాంతాల బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారీ యెత్తున పోలీస్ బందో బస్తు చేశారు. ఈ ముట్టడికి రాష్ట్ర బిసి విద్యార్ధి సంఘం కన్వీనర్ వేముల రామ కృష్ణ నాయకత్వం వహించారు.ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక సంవత్సరం క్రిందట బీసీలు ఉద్యమించగా బీసీ బందు పథక ప్రవేశపెడతామని ప్రకటించారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం “బీసీ బందు పథకం” ప్రకటించాలని కోరారు. ఇక బి.సి కార్పోరేషన్ మరియు ఎం.బి.సి. కార్పొరేషన్ 12 బి.సి కుల ఫెడరేషన్లు నామ మాత్రంగా ఉత్సవ విగ్రహాల వలే తయారయ్యాయి. బి.సి కార్పోరేషన్ మరియు 12 బిసి కుల ఫెడరేషన్ల సిబ్బందికి పని లేకుండా పోయింది. సంస్థలను నిర్వీర్యంగా తయారు చేశారు. వీటికి బడ్జెట్ విడుదల చేసి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తుందని, బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రేవేట్ యూనివర్సిటీలలో BC/SC/ST రిజర్వేషన్లు ఎత్తివేసారని, అలాగే 294 బిసి కాలేజి హాస్టళ్ళకు, 290 బీసీ గురుకుల విద్యాసంస్థలకు ఒక్కదానికి కూడా సొంత భవనం నిర్మించే లేదు. అలాగే ఇంజనీర్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ చేయకుండ, బీసీలను చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇస్తుంది. మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇస్తుంది. కానీ హిందూ బీసీలకు ఇవ్వడం లేదు. హిందువులలో – బీసీలలో పుట్టడమే నేరమాయని ప్రశ్నించారు. బీసీ వ్యతిరేక చర్యలు మానుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
6 సంవత్సరాల క్రితం ఆనాటి ధరల ప్రకారం నిర్ణయించిన మెస్ చార్జీలు స్కాలర్ షిప్ లు నేటికి కొనసాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం 25 శాతం మెస్ ఛార్జీలు పెంచుతున్నట్లు 40 రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇంత వరకు G.O విడుదల కాలేదు పైగా గత 6 సంవత్సరాల కాలంలో పెరిగిన ధరల కనుగుణంగా ఈ మెస్ ఛార్జీలు పెంపుదలలేదు. గత 6సంవత్సరాల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు 100 శాతం నుంచి 200 శాతంకు పెరిగాయి. 2017లో ధరలు కిలో కందిపప్పు రూ.60 రూపాయలు ఉంటే నేడు రూ.130 రూపాయలకు పెరిగింది. అలాగే కిలో మంచి నూనె రూ.55 ఉండేది నేడు రూ.170 రూపాయలకు పెరిగింది. గ్యాస్ ధర రూ.400 నుండి రూ.1200 కు పెరిగింది. ఇలా నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కావున మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనలు 25 శాతం సరిపోదు. దీనిని కనీసం 50 శాతంకు పెంచడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవ తీసుకోని గతంలో పెంచిన మాదిరిగా పెరిగిన ధరల కనుగుణంగా పెంచాలని విజ్నప్తి చేస్తున్నాం. గతంలో 2017లో మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిపార్సుల కంటే ముఖ్యమంత్రి ఎక్కువ చేసి పెంచారు. ఇప్పుడు కూడా పెంచాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా సుందరంగా, వైభవంగా సచివాలయాలకు కొత్త భవనాన్ని నిర్మించారు. రికార్డ్సు సృష్టించారు. చాలా సంతోషం. అమెరికాలోని డల్లాస్ తో పోటీపడే విధంగా కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలిలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లైఓవర్, స్కే ఓవర్స్, అండర్ సబ్ వేలు నిర్మించి రికార్డ్ సృష్టించారు. ఇదే విధంగా దేశాద్దోరాకులు భావి భారత పౌరులు నివసించే బీసీ కాలేజీ హాస్టళ్ళుకు స్వంత , బీసీ భవనాలు, గురుకుల పాఠశాలలు కూడా స్వంత భవనాలు నిర్మించి రికార్డు సృష్టించాలని కోరారు.
రాష్ట్రంలో 295 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 321 బీసీ గురుకుల పాఠశాలలకు ఒకదానికి కూడా సొంత భవనాలు లేవు. కేటాయించిన ప్రభుత్వ స్థలాలను కూడా ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అధికారులు లంచాలు తిని దారదత్తం చేస్తున్నారు. దొరల కార్లు వెళ్లడానికి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకా పేట్ లో ఫ్లై ఓవర్లు, స్కై ఓవర్స్ ను వేలకోట్ల రూపాయలతో వెచ్చించి కడుతున్నారు. కానీ చదువుకొని భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ లు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కావల సిన విద్యార్థులను అద్దె భవనలలో బందెల దొడ్డిలో పశువులను తొలినట్లు ఒక్కొక్క రూంలో 20 నుంచి 50 మందిని వుంచుతున్నారు. భవిష్యత్ దిబ్బ తిస్తున్నారు.చదువు దెబ్బ తింటుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇదేం న్యాయం? బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తారా? అని ప్రశ్నించారు.ఈ ముట్టడిలో వేముల రామకృష్ణ, జి..కృష్ణ, నీల వెంకటేష్, కిషోర్, హరీష్, సుధాకర్, రాజేందర్భూ, మన్న యాదవ్, మణికంఠ, మోడి రాందేవ్, భాస్కర్ప్రజాపతి,నానిముదిరాజ్, శ్రీనివాస్, దివిజ్ తదితరులు పాల్గొన్నారు.
Prev Post