ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని సూరారం గ్రామంలో గురువరం సూపర్ సీడ్స్ ప్రైవేటు కంపెనీ క్షేత్ర పరిశీలన నిర్వహించారు. సూపర్ సీడ్స్ కంపెనీ ఉద్యోగుల సమక్షంలో జనార్దన్ రెడ్డి రైతు సూపర్ సీడ్స్ వారి దేవిక వరి రకం పంట వాడిన సందర్భంగా రైతుల సమక్షంతో సూపర్ సీడ్స్ వారి క్షేత్ర పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ…సూపర్ సీడ్స్ వారి దేవిక వరి రకం వేయడం వలన ముఖ్యంగా మొదట విత్తనాలు అన్నియు మొలకెత్తడంలో చాలా సంతోషమన్నారు అదేవిధంగా పంట పెరగడంలో అధిక వర్షాలు కురిసినప్పటికీ కూడా మొక్కలు ఎలాంటి నష్టం కలగకుండా తట్టుకొని నిలిచాయన్నారు. ఎలాంటి వర్షపాతానికి తెగుళ్లు దోమ మరియు పురుగు పై తట్టుకొని నిలుస్తుందని తెలిపారు. సూపర్ సీడ్స్ కంపెనీ ఏరియా మేనేజర్ కిరణ్ గౌడ్ మాట్లాడుతూ…ముఖ్యంగా అన్నిరకాల నేలలకు అనువైన రకం పంట కలాం110-120 వుంటుందని తెలిపారు. అలాగే ఈ యొక్క సూపర్ సీడులో వెరైటీ సూపర్-971 పత్తి రకం మక్కజొన్న విత్తనాలు అన్నీ రకలా నేలలకి అనుకులంగా వుంటుందని చెప్పరు.రైతులు నిర్భయంగా సూపర్ సీడ్స్ వారి విత్తనాలు వేసుకోవచని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్ సీడ్స్ జె.ఎస్.ఓ లు శ్రావణ్,ప్రవీణ్ చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.