లక్షెట్టిపేట మండలంలోని శాంతాపూర్ వాసికి దళితరత్న అవార్డు లింగంపల్లి వేంకటేష్ కు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి,బాబు జగ్జీవన్ రావుల జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో స్వచ్ఛందంగా ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి దళిత రత్న బిరుదులను ప్రకటించింది.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన మాదిగ హక్కుల దండోరా జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి వెంకటేష్ తెలంగాణ ఉద్యమంలో ప్రతిభ కనబరిచినందుకు గాను, బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరిచినందుకుగాను దళిత రత్న అవార్డును తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.గురువారం హైదరాబాద్ లోని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా లింగంపల్లి వెంకటేష్ దళిత రత్న అవార్డును అందుకున్నారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం తనకు అవార్డు ప్రకటించినందుకు గాను లింగంపల్లి వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking