మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు మెదక్ జిల్లా అధ్యక్షులు నంది సురేష్ గారికి దలితరత్న అవార్డు ప్రదానం తెలంగాణ ఉద్యమకారుడు దలిత సామాజిక ఉద్యమకారుడు దళిత ప్రజల సమస్యలపై వారి అభ్యున్నతికై నిత్యం పోరాటం చేసే వ్యక్తి నంది సురేష్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత రత్న అవార్డు ప్రధానం చేయడం జరిగింది అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఈ అవార్డును హైదరాబాదులోని మినిస్టర్ కోటర్స్ లో అందజేశారు. ఈ అవార్డు రావడానికి సహకరించిన మాలమానాడు రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి గారికి ధన్యవాదాలు తెలిపారు.నంది సురేష్ ను దళిత సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి గారు బందెల యశోద కాశమల్లసుజాత వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజమళ్ళ సుకుమార్ దయాకర్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు స్వామి వెల్దుర్తి మండల యూత్ ప్రెసిడెంట్ కొంతానపల్లి ధనరాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు