ధరఖాస్తు చేసుకున్న అర్హులందరికి బీసీ,మైనార్టీ లోన్,గృహ లక్ష్మి పథకం ఇవ్వాలి `మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని ధరఖాస్తు చేసుకున్న అర్హులందరికి బీసీ లోన్,మైనార్టీ లోన్,గృహ లక్ష్మి పథకం ఇవ్వాలని మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.శుక్రవారం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ లోన్ ,మైనార్టీ లోన్ ,గృహ లక్ష్మి పథకం అధికార పార్టీ వారికి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంబంధం లేకుండా వీటిని ఇవ్వాలని అన్నారు.ల్యాండ్ లేని నిరుపేదలకు కూడా గృహ లక్ష్మి పథకం వర్తింపజేయాలని కోరారు.గృహ లక్ష్మీ పథకం ల్యాండ్ ఉన్న వారికి మాత్రమే అందిస్తున్న ఈ పథకమని,.ల్యాండ్ లేని నిరుపేదలకు కూడా ఈ పథకం అమలు చేయాలినీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిన్నటి తేదీ వరకు మంథని గత మూడు రోజుల్లో మంథని మండలంలో 3100, మంథని టౌన్ 848, రామగిరి మండలం లో 1448, ముత్తారం మండలం లో 2290,కమాన్ పూర్ మండలం లో 1100, కాటారం మండలం లో 4762,మహదేవ్ పూర్ మండలం లో4200,మహ ముత్తారం మండలం లో 3500 , మలహర్ రావు మండలం లో 2698, పలిమెల మండలం లో 1288 మంది ధరఖస్తు చేసుకున్నారని తెలిపారు.మూడు రోజుల టైములో దాదాపు మా మంథని నియోజకవర్గంలో మొత్తం 25,234 దరఖాస్తులు నిన్నటి వరకు వచ్చాయన్నారువిూసేవ కేంద్రాల్లో కుల, ఆదాయ ధృవీకరణ , భూమి కి సంబంధించిన పత్రాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేకపోయారని వారికి కూడా ప్రభుత్వము అవకాశం ఇవ్వాలన్నారు.మొదటి విడతలో 3 వేల ఇండ్లు (పెద్దపల్లి1500,భూపాలపల్లి 1500) మందికి మాత్రమే మంజూరు చేస్తానని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు.గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకున్న అర్హులకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని సూచించారు.మంథని నియోజకవర్గంలో దాదాపుగా 3500 మంది బీసీ బందు పథకం కింద దరఖాస్తుచేసుకోవడం జరిగిందని ప్రభుత్వం దాదాపు 2565 మందిని మాత్రమే అర్హులగా గుర్తించిందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బీసీ బందు అమలు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.