42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలి
జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్ ఆగష్టు 12 వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టి పరిస్థితులలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు- రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేసారు. బి.సి రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 31న బి.సి.ల యుద్ధ భేరి ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ee సందర్బంగా బి.సి.ల యుద్ధ భేరి పోస్టర్ ను ఆవిష్కరించారు.పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామంటే సరిపోదు. దీని వలన బీసీలకు ఉపయోగమే లేదు. లాభం కలగదు. డబ్బున్న వారి ఎన్నికవుతాడు చట్ట పరంగానే హక్కుగా 42 శాతం ఇవ్వాలని అన్నారు. మంగళవారం కాచిగూడా లో పలు బిసి సంఘాల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ వాదం బలంగా ఉంది. ఇప్పుడు పెంచకపోతే మరి ఎప్పుడు పెరగదు.రిజర్వేషన్ల సమస్య గురించి చర్చించి కార్యాచరణ నిర్ణయించడానికి ఆగష్టు 30న బీసీల యుద్ధటిం మహానిభ రవీంద్రభారతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ సభకు రాష్ట్రంలో అన్ని జిల్లాల ముఖ్య నాయకులు, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసారు.-ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి గాను బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో మర్షణ వైఖరి అవలంబించకుండా సాధించే మార్గాలు పరిశీలించాలని సూచించారు. అందుకు అఖిలపక్ష సమావేశాలు, బీసీ సంఘాల సమావేశాలు, న్యాయ నిపులలతో, అడ్వకేట్ ల సమావేశాలు జరిపి సమ ఆలోచన చేసి పరిష్కార మార్గాలు సాధించాలని కోరారు. ఇందుకోసం చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు పలకాలని కోరారు.బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు చేయవలసిన కార్యక్రమం బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే, సానుకూలంగా కేంద్రంలో ఉండి అఖిలపక్షంతో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిష్కరించాలి సాదించాలి. కేంద్రంలో ఘర్షణ వైఖరితో ఉండడం, కేంద్ర మంత్రులను విమర్శించడం లాంటి చర్యలతో రిజర్వేషన్లు సాధించడానికి ఎలా సాధ్యం అవుతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ సాధించడానికి మార్గాలు వెతకాలి- ఘర్షణ వైఖరి కాదు. ఎ మాత్రం సరిపోదు.కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఇష్టం లేక సమస్య ఎక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుంది. కేంద్రంపై వ్యతిరేక ప్రచారం మానుకోవాలన్నారు. కేంద్రంపై పెట్టి తప్పించుకొని ప్రయత్నం చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరపి అధికారం ఎవరికి యుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి యుంది. బీసీ రిజర్వేషన్లు కూడా నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి యుంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చేసారు. కాంగ్రెస్ చేసింది. అమలు చేసి బాధ్యత కాంగ్రెసు BJPపై పెట్టి తప్పిందుకొని ఆలోదన మానుకోవాలి. అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకొని 42 శాతం రిజర్వేషన్ సాదించాలని కోరారు.ee సమావేశం లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , శ్రావణి, సుదాకర్,చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.