గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:ఢీల్లీలో కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో ప్రతిపక్షనాయకులు రాహుల్ గాంధీ ఎలక్షన్ కమీషన్ బీజేపీ కలిసి ఓట్ల దొంగతనానికి ఎలా పాల్పడ్డారు అని సాక్షాలతో సహా నిరూపించినారు. ఒక రూంలో నలుగురి కంటే ఎక్కువ ఉండలేని స్థలం ఆ ఒక్క రూంలో 85 ఓటర్లను చేర్పించడం ఆ చుట్టు పక్కల వారిని అడిగితే ఇప్పటి వరకు ఈ ఓటర్లని మేము చుడలేదని సమాధానం చెప్పడం చెప్పుకుంటూపోతే ఇంకా చాలా ఉన్నాయి.ఓటు దొంగలను బయటకు ఈడ్చలని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు గోషామహల్ నియోజక వర్గంలో కాంగ్రెస్ సీనీయర్ నాయకులు బి.సతీష్‌గౌడ్ నేతృత్వంలో గోషామహల్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఓటరు దొంగలను పట్టుకునే కార్యాక్రమాన్ని చేపట్టింది. ఈసందర్భంగా
12ఆగష్టు మంగళవారంనాడు గోషామహల్ నియోజకవర్గం గంఫౌండ్రి డివిజన్ ఈసమియా బజార్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించి ఓట్ చొర్ ఉద్యమానికి రాహుల్ గాంధీ చేస్తున్న కృషికి అభినందనలు, పూర్తి మద్దతు గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము తెలుపుతూ మా నియోజకవర్గం ఐన గోషామహల్ నియోజకవర్గం బేగంబజార్ డివిజన్ లో కూడా ఓఖే యింట్లో పదుల సంఖ్యలో వున్న ఓటులను గుర్తించడం జరిగింది అని తెలుపుతూ త్వరలో సమగ్రమైన రిపోర్ట్ ను కేంద్ర ఎన్నికల కమిటీ, రాష్ట్ర ఎన్నికల కమిటీ, మరియు రాహుల్ గాంధీ లోకసభ లో ప్రతిపక్ష నాయకులకు ఢల్లీి వెళ్లి అందించి బేగంబజార్ డివిజన్ లో వున్న దొంగ ఓట్లు ఏరివోతకు అలుపుఎరుగని పోరాటం చేస్తాం అని తెలిపారు ఈ సమావేశం లో బద్దం సతీష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నిర్మల్ కుమార్ యాదవ్ ఏఐసీసీ ఓబీసీ జాయింట్ కన్వినర్,డాక్టర్ శ్రీనివాస్ వంజారి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇఫతేఖర్ ఖైరతాబాద్ సేవాదళ్ ప్రెసిడెంట్,నరేందర్ గంఫౌండ్రి డివిజన్ ప్రెసిడెంట్, చేతన్ కుమార్ యూత్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ, శివ సేవాదళ్ గంఫౌండ్రి ప్రెసిడెంట్, రాధా కృష్ణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.