బీసీల రాజకీయ పోరాట యోదుడు ఆర్ కృష్ణయ్య

సంగా రెడ్డి సెప్టెంబర్ 13 (); రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య 67వ జన్మదిన వేడుకలు విద్యానగర్ బీసీ సంక్షేమ భవన్ లో ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ను శాలువాతో పూలగుచ్చంతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరిగే వరకు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో చట్టాన్ని అనుసరించి ఒక న్యాయవాదిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోవూరి సత్యనారాయణ గౌడ్ బీసీలకు జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో 50 శాతం పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించే వరకు 10 లక్షల మందితో అలుపెరుగని పోరాటం చేస్తూ బీసీలకు న్యాయం చేకూర్చుటకు ముందు ఉంటానని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సంగప్ప గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking