ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలి జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..వినాయక చవితి, గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను అన్ని శాఖలు సమన్వయంతో పక్కగా ఎర్పాటు చేయాలని నిర్మల్ జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి సంఘం నాయకులు, పోలీసు అధికారులు, వివిధ శాఖల అధికారులతో ఈనెల 18 న వినాయక చవితి పండుగ, 28 న గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ మండపాల వద్ద పారిశుద్ధ్యం, విద్యుత్ ఏర్పాట్లు చేయాలని, పెద్ద విగ్రహాల మండపాల వద్ద అగ్నిమాపక ప్రమాదాలు జరగకుండా అగ్రిమాపక ఏర్పాట్లు పరిశీలించాలని, కమిటీ ప్రతినిధులకు అవసరమైన సూచనలు అందించాలని , నిమజ్జనం సంబంధించి నిర్దేశించిన ప్రదేశాలలో పూర్తిస్థాయి బారికేడ్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం త్రాగునీరు, లైటింగ్, మొబైల్ టాయిలెట్ నిర్వహించాలని అలాగే నిమజ్జనం పాయింట్ల వద్ద క్రేన్ లను ఏర్పాటు చేయాలని గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, వారి వివరాలు ముందుగానే జిల్లా యంత్రానికి అందించాలని మత్స్య శాఖ అధికారిని, నిమజ్జన పాయింట్ల వద్ద 108 వాహనాలు, ఏర్పాటు చేయాలని, ప్రతి పాయింట్ వద్ద, అలాగే మండల కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని , రెవిన్యూ డివిజనల్ అధికారులు ఉత్సవ కమిటీ మెంబర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని పండుగ, నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు. చేయించాలని, విద్యుత్ వైర్లు. వెలాడకుండా చూడాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కోతుల బెడద ఉండకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మండపాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుగానే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, తద్వారా మండపాల వద్ద ఏర్పాట్లు, క్రేన్ ఏర్పాట్లకు సులువుగా ఉంటుందని తెలిపారు.
మండపాలలో గణేష్ ప్రతిమ ను ప్రతిష్టించే సమయంలో పోలీసు శాఖ సహాయపడుతుందని తెలిపారు. అలాగే మండపాల వద్ద ప్రతి రోజు ఒకరు రాత్రిపూట ఉండేలా చూడాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవచ్చని, షిఫ్టు ప్రకారం ఒకరు ఉండేలా చూడాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆన్నారు.
నిమజ్జనం రోజున రాత్రి 12 లోగా నిమజ్జనం పూర్తి చేసేలా అందరి సహకార, సమన్వయంతో పూర్తి చేయాలనీ, గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉత్సవ కమిటీ మెంబర్స్. మండపాల విషయం లో జాగ్రత్తలు పాటించి. సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధనపు కలెక్టర్ రెవెన్యూ. కిషోర్ కుమార్, డి ఎస్ పి గంగారెడ్డి, ఆర్ డి ఓ. రత్న కల్యాణి, పీస్ కమిటీ, ఉత్సవ కమిటీ మెంబర్స్ , జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking