పెద్దపల్లి బి ఆర్ ఎస్ కు భారీ షాక్
బీసీ నేతగా గుర్తింపు
పెద్దపల్లి అసెంబ్లీలో 40 వేల ఓట్లు ముదిరాజుల వే
పెద్దపల్లి ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 14
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో అసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంచలనాలకు మారుపేరైన పెద్దపల్లి బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ కొలీపాక శ్రీనివాస్ మరియు కొలిపాక సంధ్యలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కొలిపాక శ్రీనివాస్ బ్రదర్స్ కలిశారు. ఇక బిజెపిలో వారి చేరిక లాంచనప్రాయమే. ఒకటి రెండు రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. వీరి రాజీనామాతో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరి నుంచి ఒకరు బీసీ వర్గాలు టిఆర్ఎస్ పార్టీకి దూరమవుతున్నారు. కొలిపాక శ్రీనివాస్ తండ్రి కొలిపాక నరసయ్య ఇటీవలే ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ కి జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా నిలబడి విజయం సాధించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజ్ కులంలో వీరి కుటుంబ ప్రాధాన్యత నరసయ్య ఎంపికతో క్రియాశీలకంగా మారింది. కొరిపాక కుటుంబాన్ని ధైర్యాన్ని చూసి వీరి రాజకీయ వ్యూహాలకు ముదిరాజ్ సామాజిక వర్గం వీరిని భవిష్యత్తు ఆశాజ్యోతి గా చూస్తుంది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంత ధైర్యంగా ఆ సామాజిక వర్గాన్ని ముందుకు నడిపించిన వారు లేరు. పద్మశాలి, గౌడ, యాదవ కులాల ఓట్ల పునరేగికరణ జరిగేలా ప్రయత్నాలు ప్రారంభించారు. తమ రాజకీయ భవిష్యత్తుకు బిజెపి సరియైన పార్టీ అని అందులో చేరిపోయేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. పెద్దపల్లి టికెట్ పై ఆశ పెంచుకున్న కొలిపాక శ్రీనివాస్ వినూత్న రాజకీయ ఒరవడితో ముందుకు కదులుతున్నారు. కొలిపాక శ్రీనివాస్ టిఆర్ఎస్ విడకుండానే బిజెపి పార్టీలో టికెట్ అభ్యర్థించారు. అనంతరం రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ హుజరాబాద్ శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ ఆశీర్వాదం తీసుకున్నారు. చేరిక ముందు ఈటల పెట్టిన పరీక్షలో ఆయన నెగ్గారు. సుమారు 200 వాహనాలలో 1500 మంది వారి అనుచరులు వారి సామాజిక వర్గం తీసుకొని పోయి ఈటల ముందు బల ప్రదర్శన చేశారు. అంతేకాకుండా తన వెంట నడిచిన ముదిరాజు సామాజిక వర్గాన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రమాణం చేయించారు. దీన్ని గమనించిన ఈటల రాజేందర్ ముదిరాజులలో శ్రీనివాస పట్టుకు అబ్బురపడిపోయారు. భవిష్యత్తు బిజెపిలో చేరిపోయే ముందు బిజెపి అగ్ర నాయకులైన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో తో పాటు పలువురు ఆశీస్సులు పొందాలని ఈటల రాజేందర్ శ్రీనివాస్ కు సూచించారు. తనకు బిజెపి టికెట్ ఇస్తే బీసీల బలంతో గెలిచి వస్తానని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందు ఉంచారు. తనకు టికెట్ ఖరారు చేస్తే టిఆర్ఎస్ పార్టీని భారీగా దెబ్బ కొడతానని చెప్తున్నారు. బి.ఆర్ పార్టీకి చెందిన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లతోపాటు ప్రస్తుత ప్రజాప్రతిథులైన సర్పంచులు ఎంపీటీసీ లతోపాటు పలువురు మాజీ ప్రజాప్రతితులు భాగస్వామ్యంతో పెద్దపల్లిలో 30 వేల జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభ మధ్య చేరిపోతానని తన ప్రణాళికను రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ముందు పెట్టారు. కొలిపాక బ్రదర్స్ బిజెపి పార్టీలో చేరకముందే వారి వ్యూహాలు అర్థం కాక ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆలోచనలో పడ్డారు కొలిపాక శ్రీనివాస్ దూకుడును ప్రజలు ఆసక్తికరంగా గమనిస్తున్నారు పెద్దపల్లి రాజకీయాలలో బీసీల నుంచి ఒక యువ నాయకుడు బయలుదేరి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని పలువురు బీసీ నేతలు బీసీ వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారు