జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 :
వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భావన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి లతో కలిసి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు,సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో సీజనల్ వ్యాధులు, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలతో పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా,మండల,ఉప కేంద్రాల పరిధిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని,వైద్య పరీక్షలు,వైద్య సేవలలో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులలో డెంగ్యూ కేసులు నమోదు అయినట్లయితే సంబంధిత సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వెంటనే అందించాలని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉదయం 9 నుండి అందుబాటులో ఉండాలని, ఆయా కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించాలని,బస్తీ దవఖానాలు అంతట వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని,అన్ని రకాల మందులు నిల్వ ఉంచుకోవాలని తెలిపారు.ప్రభావిత గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,రోగాలు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామపంచాయతీ, మున్సిపల్, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఐ.సి.డి.ఎస్. సమన్వయంతో పని చేయాలని తెలిపారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా రికార్డు అయినట్లయితే, వివరాలను ఆయా పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని, దోమలు వృద్ధిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రైవేటు వైద్యులు ఆసుపత్రులకు వచ్చే జ్వరం రోగుల వివరములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి తెలియజేయాలని, పాజిటివ్ కేసులకు సంబంధించి నమూనాలు సేకరించి పరీక్ష చేసి డెంగ్యూగా నిర్ధారణ చేయాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ లో భాగంగా అన్ని ఆసుపత్రులు రిజిస్టర్ చేసుకోవాలని, ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించే వైద్యులు, వైద్య సేవలు,రుసుముల వివరములను ప్రదర్శించాలని తెలిపారు.జిల్లాలోని ప్రోగ్రాం అధికారుల ద్వారా 5 బృందాలను ఏర్పాటు చేసి ప్రతి మండలాలకు పంపించి వివరములు సేకరించడం జరుగుతుందని,ఈ బృందాలు గ్రామాలను సందర్శించినప్పుడు ప్రైవేటు వైద్యులు కూడా సహకారము అందించాలని తెలిపారు.జిల్లాలో ప్రతి వైద్యుల వివరములు, ఆసుపత్రుల వివరములు నమోదు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని,లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో 32 స్కానింగ్ పి.సి.పి.ఎన్.డి.టి. ద్వారా నమోదు అయ్యాయని, నమోదు అయిన స్కానింగ్ సెంటర్లలో యాక్ట్ ప్రకారంగా రికార్డులు నిర్వహించాలని,లింగ నిర్ధారణ చేసినట్లయితే పి.సి.పి.ఎన్.డి.టి. చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యాధికారులు రోజువారీగా నివేదికలను అందించాలని, అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో కళాజాత,టామ్ టామ్ చేయించాలని తెలిపారు.అనంతరం జాతీయ కీటక జనత వ్యాధుల నియంత్రణ సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.