16 నెలలు గడిచిన అందని పరిహారం – రేజితల్ గ్రామ రైతుల ఆవేదన.
డిప్యూటీ కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల నేటికీ పరిస్కారం కానీ సమస్య.
జిల్లా కలెక్టర్ కు గ్రామస్తుల వినతి.
సంగారెడ్డి ఆగష్టు 17ప్రజ బలం ప్రతినిధి:
మా భూములు ఎకరాలు 1700 ప్రభుత్వానికి నిమ్జ్ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం స్వచ్చందంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తే డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 1 నాగలక్ష్మి నిర్లక్ష్యం వల్ల 16 నెలలు అయిపోతున్న నేటికీ సమస్య పరిష్కారం అవ్వటం లేదని, రేజితల్ గ్రామ రైతుల ఆవేదన, భూనిర్వాసితుల ఆధ్వర్యంలో వినతిపత్రం శ్రీ. పద్మజ రాణి డి.ఆర్.ఓ & జిల్లా మిజిస్ట్రేట్ కి ఇస్తున్న బాబు జగ్జీవన్ రామ్ సమతా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ వేణుగోపాల్, భూనిర్వాసితులు అల్గి. వినయ్ కుమార్, మల్లారెడి, వంశీ తదితరులు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రేజింతల్ గ్రామానికి సంబంధించి 1700 ఎకరముల భూమి, అందులో 350 ఎకరాల భూ పట్టేదారులు కాన్స్టంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికి నిమ్జ్ అధికారులు డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి L.A 1గారు నిర్లక్ష్యం చేస్తూ రైతులకి ఇబ్బదులకి గురి చేస్తున్నారు, మొదటి విడత ఎల్గోయి గ్రామానికి 3 లేదా 4లక్షలు ఇవ్వడం జరిగింది, అ తర్వాత గ్రామస్థులు 15 లక్షల చొప్పున ఇవ్వాలని కోర్టుకి వెళ్లడంతో, రెండవ విడత చెక్కుల పంపిణి జూన్ 20 రోజున జరసంగం ఫంక్షన్ హాల్ లొ గౌ “ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, మరియు జిల్లా కలెక్టర్ లు కలిసి 22కోట్ల 50 లక్షల రూపాయల చెక్కుల పంపిణి చేయటం జరిగింది. నేటికీ కూడా ఎల్గోయి గ్రామం పైననే అధికారులు దృష్టి పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.
అధికారులు చేతివటం చూసుకుని, స్వయంగా డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి L A.1 (ల్యాండ్ ఆక్యూవేషన్) ఏ.జి. ఆఫీస్ కి వెళ్లి ఒపీనియన్ అవార్డు తెచ్చుకుని ఫండ్ రిలీజ్ చేయించుకుని మోటలకుంట గ్రామం సంబంధించి మొత్తానికి డబ్బులు ఇవ్వడం జరిగింది, అదేవిదంగా మామిడి గ్రామా రైతులు 25 మందికి జనవరి నెలలో & కలిబెముల, బసంతాపూర్, గ్రామాలకి సంబంధించి హైకోర్టు ద్వారా ఒపీనియన్ అవార్డు తెప్పించుకొని డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రివర్యులు స్పందించలని కోరుతూ, ఇప్పటికి రేజింతల్ గ్రామ రైతులు 16 నెలల నుండి వినతి పత్రాలు ఇస్తూ, కాళ్ళు అరిగేలాగా తిరుచున్న, మోరపెట్టుకున్న స్పందించక పోవటానికి గల కారణాలు రైతులకి తెలపాలని కోరుచున్నామని రైతు లు ఆవేదన వ్వక్తం చేశారు.