మణికొండలో కే.టీ.ఆర్ పటానికి పాలాభిషేకం.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 17 ఆగస్టు 2024:
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుని ఐ.టీ హబ్ గా తీర్చి దిద్దిన కల్వకుంట్ల తారక రామారావు నిద్ర పోతున్న ప్రభుత్వానికి అమూల్యమైన సలహాగా ఉచిత బస్లలో సీట్ల పెంపు చేయమని, పొరపాటున మహిళల ఉచిత బస్ ప్రయాణంపై చిన్నపాటి మాటకి మహిళా కమిషన్ స్పందించి నోటీసులు జారీ చేయడం, రోజు రోజూకి మహిళలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాలు ద్విగిని కృతం కాగా మహిళలపై దోపిడీలు జరుగుతున్నను కానరాని కబోధి లాగా మహిళా కమిషన్ స్పందించ కుండా మిన్నకుండడం కూడా విడ్డూరమే, ఒక మానవతా వాదిగా సహోదరి మణుల్లందరికి తాను క్షమాపణలు కోరిన పిదప కూడా రాజకీయ రంగులు పూసి సంకుచిత భావాలతో, రాజకీయాలలో అబద్దాలతో పూట గడుపుకుంటూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపెట్టిన కే.టీ.ఆర్ యొక్క ఫోటోను దహన పరిచినందుకు పర్యవసానంగా మణికొండ భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున మఱ్ఱిచెట్టు వద్ద హాజరై కల్వకుంట్ల తారక రామారావు ఫోటోకు పాలభిషేకం గావించి, పాలతో కళ్ళాపి చల్లి అట్టి స్థలాన్ని శుద్ధి చేసి పండుగ చేసుకోవడం జరిగినదని సీతారాం ధూళిపాళ తెలుపుతూ సిద్దిపేట బీ.ఆర్.ఎస్ శాసన సభ్యుడు తన్నీరు హరీశ్ రావు యొక్క ఆఫీసుపై భౌతిక దాడులను ఖండిస్తూ తమ నిరసన తెలిపిన వారిలో మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డి, విజయ లక్ష్మి,, లతా గౌడ్, సీనియర్ నాయకులు అందె లక్ష్మణ్ రావు, రాజేంద్ర ప్రసాద్, ఏర్పుల శ్రీకాంత్, సంగం శ్రీకాంత్, శ్రీనాథ్ గౌడ్, మోహన కృష్ణ, ఉపేంద్రనాధ్ రెడ్డి, ఆరిఫ్, బొద్దు శ్రీధర్ గుప్తా, యాలల కిరణ్, హుస్సేన్, బాలకృష్ణ, రేఖా, మంజు, సింధు, అను, బాలాజీ, సంగం ప్రశాంత్, ప్రవీణ్, మల్లాపురం శ్రీనివాస్, శివ ముదిరాజ్, తిరుపతి, జైరామ్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, బెన్ని, తిమోతి, సాయి, ముత్యాలు, ఏం.బాబురావు, జయరాం, విజయ్, శివరాజ్ తది తరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking