స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి

రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సి.సుదర్శన్ రెడ్డి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 :
ఓటర్ జాబితాలో రూపొందించడంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టమైన జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సి.సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఓటరు జాబితా పై ఇంటింటా సర్వే నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు,కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఇలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేందుకు అధికారులు కృషి చేయాలని తెలిపారు.ఈ క్రమంలో 2 దశలలో ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ప్రీ రివిజన్ యాక్టివిటీస్,29 నుండి రివిజన్ యాక్టివిటీస్ నిర్వహించాలని,మొదటి 30 రోజులలో ఇంటింటి సర్వే నిర్వహించి 18 సంవత్సరాలు వయసు నిండిన వారిని జాబితాలో నమోదు చేయడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వారందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు,సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వారి పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని, బి.ఎల్.ఓ.యాప్ ద్వారా సర్వే చేసి వివరాల నమోదుపై తర్ఫీదు ఇవ్వాలని,ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి,శాసనసభ నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్ల వివరాలను పరిశీలించి వారి ద్వారా శిక్షణ అందించాలని తెలిపారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను బూత్ స్థాయి అధికారులకు అందించి వారి పోలింగ్ కేంద్రం పరిధి మ్యాప్ ఇచ్చి ఇంటింటి సర్వే నిర్వహించేలా పర్యవేక్షించాలని తెలిపారు. సెప్టెంబర్ 15 వ తేదీలోగా ఇంటింటి సర్వే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,పోలింగ్ కేంద్రం గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేలా చూడాలని తెలిపారు.చిరునామా మారిన ఓటర్ల వివరాలు పరిశీలించాలని,ప్రతి వారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని,సమావేశ సంబంధిత వివరాలను సి ఈ ఓ వెబ్ సైట్ లో నమోదు చేయాలని తెలిపారు.ఈ.పి.నిష్పత్తి ఆధారంగా వివరాల నమోదు చేయాలని, వివరాల నమోదులో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కార్యచరణ ప్రకారంగా సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సూపర్వైజర్లు,బూత్ స్థాయి అధికారులకు ఓటరు జాబితాలో వివరాల నమోదు,యాప్ వినియోగం,ఇంటింటి సర్వే అంశాలపై శిక్షణ అందించాలని,ఓటరు జాబితాలో వివరాల నమోదు,మార్పులు, సవరణలు,తొలగింపుల కొరకు వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి పరిష్కరించాలని తెలిపారు.జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈనెల 20 నుండి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఓటరు జాబితా పై ఇంటింటా సర్వే నిర్వహించి భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బి ఎల్ ఓ యాప్ నందు వివరాల నమోదుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటరు జాబితాలో వివరాల నమోదుకు అవసరమైన సామాగ్రి, అధికారులు శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు రాములు, హరికృష్ణ,భూసేకరణ ప్రత్యేక అధికారి చంద్రకళ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking