పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 మంచిర్యాల జిల్లాలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులతో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాలలో ప్రతి ఇంటింటి నుండి ప్రతిరోజు తడి చెత్త, పొడి చెత్తలను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించి వాటిలో ఉపయోగపడే చెత్తను వేరుచేసి కంపోస్టు షెడ్ కు తరలించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు దోమల వృద్ధిని అరికట్టేందుకు ఫాగింగ్,బ్లీచింగ్ పౌడర్,ఆయిల్ బాల్స్ పిచికారీ చేయాలని తెలిపారు.వీధి దీపాలు,పారిశుధ్యం, నీటి సంబంధిత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా నిరంతరంగా సరఫరా చేసే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతినెల గ్రామ స్థాయిలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ.పి.ఓ.లు, వి.ఓ.లకు శిక్షణ అందించాలని,ఆశ, అంగన్వాడి కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటింటికి తిరుగుతూ పరిశుభ్రత ఆవశ్యకత పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.నివాస ప్రాంతాలు,కూలర్లు, టైర్లు,కొబ్బరి బొండాలు తదితర నీటి నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.డెంగ్యూ కేసులు గుర్తించిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమీపంలోని ఇండ్లను సందర్శించి లార్వా పాయింట్లు, బ్రీడింగ్ గ్లాండ్స్ ఉన్నట్లయితే యాంటీ లార్వా స్ప్రే పిచికారి చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వారానికి రెండుసార్లు ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని, వర్షపు నీటి నిలువలు లేకుండా తొలగించడంతో పాటు అవసరమైన ప్రాంతాలలో ఇసుకతో కప్పివేయాలని తెలిపారు.అధికారులు బృందాల వారీగా ప్రతిరోజు తమ పరిధిలోని నివాసాలు, వసతి గృహాలు సందర్శించి పారిశుద్ధ్య నిర్వహణ పర్యవేక్షించాలని, అమృత్ పథకానికి సంబంధించి భూమిని గుర్తించాలని తెలిపారు.పారిశుధ్య నిర్వహణలో అశ్రద్ధ వహించి ఇబ్బందులకు కారణమైన వారికి జరిమానా విధించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్లు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking