ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణం లోని లిటిల్ స్టార్ గ్రామర్ స్కూల్ లో రాఖీ పౌర్ణమి సంబరాలు నిర్వహించారు. పాఠశాల లోని పిల్లలందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకొని రాఖీ పండుగ శుభకాంక్షలు తెలుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సంతపురి కిషోర్ కుమార్ మాట్లాడుతూ… హరాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షా బంధన్ లో రక్ష అంటే రక్షించడం,బంధన్ అంటే సూత్రం అని అర్థం.అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం(రక్షా బంధన్) కడతారు.తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ,వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు. అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి, వారి నుదుట వీర తిలకం పెడతారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు.అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు.అని రాఖీ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మినుములు శ్రీనివాస్, మొహమ్మద్ హమీద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.