లక్షెట్టిపేట లో వైద్యుల శాంతియుత ర్యాలీ

 

ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాల కు రక్షణ ఏది

వైద్యుల పై జరుగుతున్న దాడులను అరికట్టాలి

ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 17 : ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలకే నేడు రక్షణ లేకుండా పోతున్నదని లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.కోల్ కతా లో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య జరిగిన సంఘటనను నిరసిస్తూ పట్టణంలో వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రభుత్వ వైద్యులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నేడు వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కోల్ కతా ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు పవిత్ర,సలీం శ్రావణ్ గౌడ్,సుదర్శన్,అజయ్ ప్రమోద్ విజయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking