ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి 16 : టీపీసీసీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాలమేరకు,మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు శుక్రవారం రోజున మంచిర్యాల మంచిర్యాల ఐబీ చౌరస్తా లో మాజీ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.మహిళలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ… కెటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.తక్షణమే కేటీఆర్ మహిళా లోకంకు క్షమాపణ లు చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తెలంగాణ భవనంను ముట్టడిస్థామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో మహిళలను సమ్మక్క,సారలమ్మ,చాకలి ఐలమ్మ,రుద్రమదేవి అంటూ కీర్తించిన కేటీఆర్ కు ఇప్పుడు మహిళల పట్ల చులకన భావం చూపడం శోచనీయమన్నారు. కెసిఆర్ దిష్టి బొమ్మను దాహనం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి,జిల్లా మహిళా నాయకురాలు, జిల్లా నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.