లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఏప్రిల్ 11 : వేసవికాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని లక్షెట్టిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ తెలిపారు.వేసవికాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలకు సెలవులు సమిపిస్తుండడంతో మనది గోదావరి పరివాహక ప్రాంతం కావున పిల్లలు సమీపంలోని గోదావరిలో,వ్యవసాయ బావుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి అవంచనియా సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. అలాగే ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.నీడ పట్టణం ఉండే ఆటలు ఆడుకునే విధంగా చూసుకోవాలన్నారు.వేసవి కాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని లక్షెట్టిపేట దండేపల్లి,జన్నారం మండల ప్రజలను ఉద్దేశించి తెలిపారు.