పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
దోమలకు అవకాశం ఇవ్వొద్దు
ప్రజలకు ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విజ్ఞప్తి
ఖమ్మం ప్రతినిధి జూన్ 25 (ప్రజాబలం) ఖమ్మం వర్షాకాలం వ్యాధులు ముసిరే సీజన్ కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ కనీస జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యం అప్రమత్తంగా
ఉండాలని ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ మార్పులు సంభవించి, సీజనల్ వ్యాధులు వేగంగా ముసురు తాయని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చేతులు శుభ్రంగా కడుక్కుని తీసుకునే ఆహారం, తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండా లన్నారు. దోమలు కుట్టకుండా దోమ తెరలు ఉపయోగించా లన్నారు. నివశిస్తున్న ప్రాంతా లను పరిశుభ్రంగా ఉంచు కుంటూ చుట్టుపక్కల ఎక్కడా మురుగునీరు నిల్వ ఉoడ కుండా చూసుకోవాలని కోరారు. బాక్టీరియా, వైరస్ లు, ఫంగస్ , దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటూ . వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటినే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నామ నాగేశ్వరరావు ప్రజలను కోరారు.