మున్సిపల్ అధికారులు అంబుయన్స్ కోర్ట్ యార్డ్ పైప్లైన్ పనులను పరిశీలించడం.

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 25జూన్ 2024:
ది సిటిజన్స్ కౌన్సిల్ వారి అభ్యర్థన మేరకు పందెం వాగు నాలా పరిరక్షణలో భాగంగా, ఈరోజు 25 జూన్ 2024 రోజున రీజినల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శ్రీనివాస్ రెడ్డి వారి అధికార బృందంతో కలసి అంబుయన్స్ కోర్ట్ యార్డ్ తానాషా నగర్ హుడా కాలనీ దగ్గర ఉన్న బహుళ అంతస్తుల సముదాయం మొదలుకొని ఎంప్లాయిస్ కాలనీ దగ్గర ఉన్న పందెం వాగు నాలా వరకు పర్యటించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న పైప్లైన్ పనులను పరిశీలించడం జరిగింది. వారితో పాటు మణికొండ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, డి.ఈ దివ్య జ్యోతి, పబ్లిక్ హెల్త్ సూపర్డెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మొదలగు వారందరు స్థానికులు తెలిపిన సమస్యల గురించి అవగాహన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నివాసస్తులు, ప్రధాన మౌలిక సదుపాయాలు మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి పరచకుండా బహుళ అంతస్తు సముదాయాలకు అనుమతులు ఇచ్చిన కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేయడం జరిగింది. స్థానికులతో పాటు ప్రజాభిప్రాయ సమస్యలను అరికట్టడానికి ముందుండే ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు లక్ష్మణరావు, కార్యదర్శి ఆరిఫ్, ఉప కార్యదర్శి ఉపేందర్ నాథ్ రెడ్డి, కోశాధికారి దిలీప్, తానాషా నగర్ హుడా కాలనీ అధ్యక్షుడు రాజశేఖర్ మరియు ఎంప్లాయిస్ కాలనీ అధ్యక్షుడు పెంటారెడ్డి ఆధ్వర్యంలో మొత్తం మణికొండ పురపాలక సంఘానికి ఏకైక మురుగునీరు పారే వ్యవస్థ పందెం వాగు నాలా కావడంతో నాలాని బాక్స్ డ్రైన్ రూపంలో ఆధునికరణ మరియు అభివృద్ధి చేయకుండా పెద్ద పెద్ద బహుళ అంతస్తు సముదాయాల నుంచి వచ్చే మురుగు నీరుతో మణికొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కాగలరని విన్నవించడం జరిగింది. ఇప్పటికే వర్షాకాల సమయంలో పలు కాలనీలు. పందెం వాగు నాలా ద్వారా మునిగిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. దయచేసి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయకుండా మునిసిపల్ శాఖ వారు బహుళ అంతస్తు సముదాయలకు అనుమతులు ఇవ్వద్దని విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా రీజినల్ డైరెక్టర్ మాట్లాడుతూ సమస్యను మొత్తం అవగాహన చేసుకున్నానని తప్పకుండా తనపై అధికారులకు ఈ విషయం తెలియజేస్తానని చెప్పడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking