బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్
గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:సోమవారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా వాణి కార్యక్రమంలో గోశామహల్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎమ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ కోఠి కామత్ హోటల్ పక్కన ఉన్న జిహెచ్‌ఎంసి షాపుల టెండర్ విషయంలో అవకతవకలు జరిగాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ టెండర్ ప్రక్రియ చేసిన ఎస్టేట్ ఆఫీసర్ బాషా గారు అవినీతికి పాల్పడ్డారని అడిషనల్ కమిషనర్ శ్రీ వత్సవ్ గారికి తెలిపారు. గతంలో ఇదే విషయం పై మూడు సార్లు ప్రజా వాణి లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎస్టేట్ ఆఫీసర్ బాషా ని పలుమర్ట్లు ఈ విషయాన్ని ప్రస్తావించిన పట్టించుకోలేదన్నారు. ఆర్టీఐ ద్వారా కూడా వివరాలు సేకరించమన్నారు. షాపులను కొంత మేర రెంట్ పెంచి , తనకు అనుకూలంగా ఉన్నవారికి కేటాయించారని ఆరోపించారు. ఒక్కో కుటంబం లో ఇద్దరు , ముగ్గురికి ఈ షాపులు కేటాయించారని తెలిపారు. ఇలా ఎలా కేటాయిస్తారన్నారు. షాపులను తీసుకున్న వారు సబ్ లీజ్ కు ఇస్తూ , ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్నారన్నారు. ఈ టెండర్ లను రద్దు చేసి , మరల పారదర్శకంగా టెండర్ లు నిర్వహించాలన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి , హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తానని… నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.