ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది గత 8నెల నుండి మధ్యాహ్న భోజనం కార్మికుల జీతాలు, 5నెల బిల్లు పెడింగ్ లో ఉన్నాయి వెంటనే విడుదల చేయాలనీ జిల్లా కలెక్టర్ల కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
బొమ్మెనసురేష్ సి ఐ టి యు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ
రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు పెండింగ్లో ఉన్నాయని నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి వంట చేసి పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనితో కార్మికులు అప్పుల పాలు అవుతున్నారు.తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రాష్ట్ర మంతటా గృహ లక్ష్మి పథకం పేరుతో గ్యాస్ సిలిండర్.రు 500 /-లకే ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అమలు శ్రీకారం చుట్టింది మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు అవసరమైయినా గ్యాస్ ను సబ్సిడీ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ 10.000/-ల వేతనం అమలు చెయ్యాలని అన్నారు.కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజన యూనియన్ జిల్లా కె రాధా,జిల్లా ఉపాధ్యక్షులు,లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి సతవ్వ, లింగవ్వ, ఆసిబాన్, లావణ్య, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు