జమ్మికుంట సీఐ వరగంటి రవి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధిజూలై 12
మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట లో జమ్మికుంట పట్టణ సిఐ రవి ఆధ్వర్యంలో సైబర్ నేరాల మీద, యువత త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, సీసీ కెమెరాల గురించి అలాగే కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రవి మాట్లాడుతూ యువత మరకద్రవ్యాలు గంజాయి వాటికి దూరంగా ఉండాలని, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్ లాంటివి మానుకోవాలని కొత్త చట్టం ప్రకారం శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, యువత వారి భవిష్యత్తును పాడు చేసుకోకూడదని కోరారు.