ఖమ్మం ప్రతినిధి జూలై 12 (ప్రజాబలం) ఖమ్మం
డ్రోన్ పరీక్షా కేంద్రం స్థలం అప్పగింతకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఏవియేషన్ అధికారులతో కలిసి డ్రోన్ పరీక్షా కేంద్రానికి ఎర్రుపాలెం మండలం రేమిడిచెర్ల గ్రామంలో ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. సుమారు 53 ఎకరాల భూమిని డ్రోన్ పరీక్షా కేంద్ర ఏర్పాటుకు అనుకూలతను పరిశీలించినట్లు కలెక్టర్ అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఏవియేషన్ అధికారులు తదితరులు ఉన్నారు.