హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్‌ సవిూక్ష బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి.

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్‌ హైడ్రా విధివిధానాలపై సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేసారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు 2వేల చదరపు కి.విూ పరిధిలో హైడ్రా విధులు నిర్వహించేలా ఉండాలి. ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్‌, ఫ్లెక్సీలు తొలగింపు, అపరాధ రుసుము వసూలు బాధ్యత హైడ్రాకు బదలాయించాలి. జోన్ల విభజనలో పోలీస్‌ స్టేషన్‌ పరిధులు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధులు పూర్తిగా ఒకే జోన్‌ లో వచ్చేలా జాగ్రత్త వహించాలి. నాళాలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినతరం చేసేలా అధ్యయనం చేయండి..
హెచ్‌ఎండీఏ, వాటర్‌ వర్క్స్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, మున్సిపల్‌ విభాగాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం ఉండేలా చూడాలి. ఒక బలమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలి. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించండి.. అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తిస్థాయి విధివిధానాలు రూపొందించండని అయన సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గోన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతకుమారి సంబంధిత అధికారులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking