ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 12 : విద్యార్థులకు అర్థమయ్యే తరహాలో విద్యా బోధన చేసి,ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి,లక్ష్మీపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను,అంగన్వాడీ కేంద్రాలను,గ్రామ పంచాయతీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్ లను,హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ…వర్షాకాలం దృష్ట్యా విద్యార్థులకు అందించే తాగునీరు,ఆహార విషయాలపై శ్రద్ధ చూపాలన్నారు.బడి బయట పిల్లలు, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి చదువు ఆవశ్యకతను వారి తల్లిదండ్రులకు తెలియజేసి బడిలో చేర్పించాలని సూచించారు.అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి సౌకర్యాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.ఆయన వెంట స్థానిక తహసీల్దార్ రాఘవేంద్రరావు,ఎంపీడీవో సరోజ,ఎంపీవో అజ్మత్ అలీ,ఏపీవో రమణ తదితరులు పాల్గొన్నారు.